క్యాసినో కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను విచారించిన ఈడీ
విదేశాలకు వెళ్లినప్పుడు క్యాసినో ఆడినట్లు వచ్చిన ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం విచారించింది. ఆయన ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీకి సమాచారం అందింది. క్యాసినో వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నాయకులకు సంబంధం ఉందని క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ను విచారించినప్పుడు ఈడీ దృష్టికి వచ్చింది. మంచిరెడ్డి ఏయే దేశాలకు వెళ్లి క్యాసినో ఆడారు..? డబ్బును ఎలా తరలించారు..? తదితర వివరాలను మంచిరెడ్డి నుంచి ఈడీ అధికారులు రాబట్టారు. మంచిరెడ్డి హవాలా మార్గంలో నగదు బదిలీ చేశారని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.