NewsTelangana

మోడీ కంటే ముందు ఈడీ వస్తోంది… జైల్లో పెడితే పెట్టుకోండి…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పందించారు కల్వకుంట్ల కవిత. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక… 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే ముందు ఈడీ రావడాన్ని చూస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలున్నాయి కాబట్టి మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందన్నారు కవిత. అది సహజంగా జరిగేదేనన్నారు. నామీదైనా, మంత్రుల మీదైనా, ఎమ్మెల్యేల మీదైనా కావచొచ్చు.. ఈడీ కేసులు పెట్టడమన్నది బీజేపీ నీచమైన ఎత్తుగడలో భాగమని విమర్శించారు. ఈడీ కేసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని చెప్పారు. ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పుకుండా సమాధానం చెబుతామన్నారు. మీడియాలో లీకులిచ్చి నాయకుల మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనం ఏం చేస్తామని చెప్పి గెలవాలిగానీ… ఈడీ, సీబీఐలతో గెలవాలనుకోవడం సాధ్యం కాదన్నారు. జైల్లో పెడతామంటే భయపడేది లేదన్నారు కవిత. చైతన్యవంతమైన తెలంగాణలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నంత వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.