NewsTelangana

మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఈసీ నోటీసు

మంత్రి జగదీశ్‌ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. మునుగోడు ఎన్నికల ప్రసంగంలో జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి బీజేపీ నేత దిలీప్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదికను, మంత్రి ప్రసంగం క్లిప్పింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తెప్పించుకుంది. వీటిని పరిశీలించిన తర్వాత మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ నిర్ధారణకు వచ్చింది. మంత్రి శనివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న ఈసీ.. వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.