Home Page SliderTelangana

తరగతి గదిలో ఎండుమిర్చి ఘాటు

సర్కారు బడి అంటే అందరికీ లోకువే. చిన్నపిల్లలు చదువుకునే స్కూల్‌లో తరగతి గదిలో తడిసిన మిర్చిని ఆరబెట్టిన ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా పలిమెల మండలంలోని పంకెనలో జరిగింది. స్కూల్ ఛైర్మన్ మోతె కిష్టయ్య తన తడిసిన మిర్చిని విద్యార్థుల తరగతి గదిలో ఆరబోశాడు. దీనితో గ్రామస్థులు మండిపడుతున్నారు. సొంత అవసరాలకు ప్రభుత్వ పాఠశాలను ఉపయోగించుకుంటున్నారని, విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి ఘాటుకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ఆవ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.