News

“ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయకండి”-ఇరాన్‌కు అమెరికా సూచన

హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వం స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్ పశ్చిమాసియా దేశాలకు చెందిన వివిధ పార్టీలకు సూచనలు చేశారు. ఉద్రిక్తతలు  పెంచే ప్రకటనలు చేసి ప్రజల ప్రాణాలను తీయవద్దని సూచించారు. హింసా చక్రాన్ని ఆపు చేయాలని, హింసను ప్రోత్సహించవద్దని హితవు చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలన్నారు. మంగోలియా రాజధాని ఉలాన్ బతార్‌లో మీడియాతో మాట్లాడుతూ గాజాలో ప్రస్తుతం హింసాత్మక పరిస్థితులు చక్కబడాలంటే కాల్పుల విరమణ ఒప్పందమే సరైన మార్గమని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాస్ సైనిక విభాగాధిపతి మహ్మద్ డెయిఫ్‌ను కూడా అంతమొందించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ భయానక పరిస్థితుల నుండి ప్రజలను కాపాడాలని ఖతార్ ప్రధాన మంత్రితో పాటు, జోర్డాన్ విదేశాంగమంత్రి, ఇతర నాయకులతో ఫోన్‌లో మాట్లాడానని పేర్కొన్నారు.