Home Page SliderTelangana

దోమకొండ టెంపుల్ లో బాలీవుడ్ నటి పూజలు

గత కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ లో అడుగు పెట్టింది. షూటింగ్ లో కొద్దిపాటి గ్యాప్ దొరికితే తెలంగాణాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శించడానికి రెడీ అవుతోంది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోటను ప్రియాంక చోప్రా ఇవాళ సందర్శించారు. మండల కేంద్రంలోని కోటలో కొలువుదీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. సోమ సూత్ర శివలింగానికి ప్రియాంక ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న అద్దాలమేడతోపాటు పరిసర ప్రాంతాలను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక రాకతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్ నటిని చూడడానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.