ఈ రోజు పగటిపూట చాలా తక్కువ.. ఎందుకో తెలుసా?..
మనకు సాధారణంగా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుందని తెలుసు. కానీ ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ రోజు (డిసెంబర్ 21) పగలు కంటే రాత్రి రెండు గంటలు ఎక్కువగా ఉంటుంది. దీనిని సుదీర్ఘ రాత్రి అంటారు. ఇలా సంవత్సరంలో రెండుసార్లు ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలం ఆయనాతం, రెండవది శీతాకాలం అయనాతం. శీతాకాలంలో ఈ రోజు డిసెంబర్ 19-23 తేదీల మధ్యలో ఇలా రాత్రి ఎక్కువగా ఉండే రోజు వస్తుంది. భూము సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుందని మనకు తెలుసు. ఇలా ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇలా తిరిగేటప్పుడు సంవత్సరంలో రెండు సార్లు దగ్గరగా, రెండుసార్లు బాగా దూరంగా ఉంటుంది. ఇలా దూరంగా ఉండే కాలంలో ఈ రాత్రులు ఏర్పడుతాయి. భూమి కక్ష్య కాస్త కోణంలో వంగి ఉండడం వల్ల సూర్యుని కాంతి భూమిపై సమానంగా పడదు. వివిధ కాలాలో వివిధ రీతుల్లో పడుతుంది. దానివల్ల రాత్రి-పగలు సమయాలలో తేడాలు వస్తాయి.