Home Page SliderNational

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,కృతి సనన్ జంటగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా “ఆదిపురుష్”. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను అందుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో జరగనుంది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హజరుకానున్నట్లు మేకర్స్ తెలిపారు.