కులగణనకు సహకరించని ఎమ్మెల్యేలు,ఎంపిలు ఎవరో తెలుసా?
తెలంగాణలో గత రెండు నెలల నుంచి నిరవధికంగా జరుగుతున్న కులగణనకు ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు,ఎంపిలు సహకరించడం లేదని,ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.అసెంబ్లీ సాక్షిగా ఆయన బీ.ఆర్.ఎస్,,బీజెపి ప్రజాప్రతినిధులపై దుమ్మెత్తిపోశారు.ప్రజలెంతో బాధ్యతాయుతంగా తమ తమ కుటుంబ వివరాలు అందించి బంగారు తెలంగాణకు సహకరిస్తుంటే …ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే సర్వేకు సహకరించకపోతే ఎలా అని వారిని సీఎం ప్రశ్నించారు.సర్వేకు సహకరించే కొద్దిమంది బీ.జె.పి ప్రజాప్రతినిధులను కూడా కేటిఆర్ చెడగొడుతున్నాడని ఆరోపించారు.కేటిఆర్,కేసిఆర్, డికే అరుణ ఇలాంటి వాళ్లంతా సర్వే వివరాలు ఇవ్వలేదని, ఇలాంటి వాళ్లు ఈ తెలంగాణ సమాజంలో నివశించే అర్హతే లేదన్నారు.