దోమలు లేని ఏకైక దేశం ఏది తెలుసా?
దోమల పేరు వింటేనే మనం సహజంగానే భయపడతాం. అవి కుడితే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయని ఆందోళన చెందుతాం. కాబట్టి రాత్రిళ్లు అవి కుట్టకుండా దోమ తెరలు, కాయిల్స్, ఆలౌట్స్ వంటివి వాడటం చేస్తుంటాం. అయితే ఇలాంటి ఏ ఇబ్బందులు లేని దేశం కూడా ఒకటుంది. ఐరోపాలోని ఐస్లాండ్. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఐస్లాండ్ లో మాత్రం జస్ట్ 40 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ చలికాలమే ప్రారంభం అవుతుంది. దీంతోపాటు కరుగుతున్న మంచు, నిరంతరం నీటి ప్రవాహం, అత్యంత చల్లటి వాతావరణం కారణంగా ఐస్లాండ్ లో దోమలు పుట్టి, పెరిగే పరిస్థితులు లేకుండాపోయాయి.