Home Page SliderInternational

ఉచిత సినిమాలతో ఎంత ప్రమాదమో తెలుసా?

ఉచిత సినిమాలను అక్రమంగా పైరసీ ప్లాట్‌ఫ్లామ్‌లపై చూడడం ఎంత ప్రమాదమో తెలుసా. మనకే కాదు దేశానికే ప్రమాదంగా మారుతున్నాయి ఈ పైరసీలు. కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా తస్కరించి, దోపిడీ చేస్తున్నారు. దీనివల్ల ఓటీటీ ఆదాయానికి దెబ్బపడుతోంది. వినియోగదారులు, పైరేట్లు పన్ను ఎగవేయడం వల్ల కంటెంట్ యజమానులు ఆదాయం కోల్పోతున్నాయి. ఇలాంటి ఆదాయాన్ని పొంది డార్క్ వెబ్ ద్వారా సంఘవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాయి. ఐపీ టీవీ ద్వారా ఫైరేట్స్ వాటిని స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇలాంటి వాటికి అక్రమంగా కస్టమర్ల వ్యక్తిగత సమాచారం సంఘవ్యతిరేక శక్తులకు చేరుతోంది. వీటి ద్వారా సైబర్ మోసాలు జరగవచ్చు.  గురు, ఐపీ టీవీ, చిత్రం, ఈగల్ టీవీ వంటివి ఇలాంటి పనులు చేస్తున్నాయి. బ్రిటన్‌లో ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. వారు ఇలాంటి వారిని వెయ్యి కంటే ఎక్కువమందిని గుర్తించారు. కంటెంటును చట్టబద్దమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే వీక్షించాలని, ఇతర అక్రమ మార్గాల ద్వారా వీక్షించడం, వాటిలో లాగిన్ అవడానికి ఈమెయిల్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను ఇవ్వడం వల్ల మన వ్యక్తిగత సమాచారమంతా ఆ ముఠాల చేతిలోకి వెళ్లిపోతుంది. అది ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. ఆర్థిక పరంగానే కాదు, కొన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో కూడా మనకు తెలియకుండానే భాగస్వాములం అవుతాం. సోనీ, జీ, హాట్‌స్టార్, ఈటీవీ, ఆహా, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్  వంటి సరైన పేరు పొందిన లైసెన్స్‌డ్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనే కంటెంట్‌ను ఆస్వాదించడం ఎంతో మంచిది.