దోమలు బీరు తాగేవారిని బాగా కుడతాయా!
దోమల వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ,మలేరియా వంటి ఎన్నో రోగాలు సంభవిస్తున్నాయి. ఈ దోమల గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడతాయి. వాటిలో బీరు తాగే వాళ్లను ఎక్కువగా దోమలు కుడతాయని కనిపెట్టారు. ఎక్కువగా చెమట్లు పట్టే వారిని కూడా కుడతాయట. ఆ వాసన వాటిని బాగా ఆకర్షిస్తుందని పరిశోధనలలో తెలిసింది. గర్భిణులను, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వారిని కూడా ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి. కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. వాటికి నోటిలో స్ట్రా లాంటి తొండం ఉంటుంది. దోమ తన బరువు కంటే మూడు రెట్లు రక్తాన్ని తాగుతుంది. దోమను చంపడానికి ప్రయత్నించి, తప్పించుకుంటే మళ్లీ 24 గంటల పాటు మన దగ్గరకు రావట. వాటికి అంత జ్ఞాపకశక్తి ఉందని వెల్లడయ్యింది.
దోమల కాటు నుండి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు బాగా పనికి వస్తాయి. వీటిలో తులసి మొక్క, లెమన్ గ్రాస్, లావెండర్, బంతి, వెల్లుల్లి వంటి వాసనలు దోమలకు నచ్చదు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే దోమలు పారిపోతాయి.