వారికి ఉచిత చేప పిల్లల పంపిణీ
బెస్త, గంగపుత్ర, ముదిరాజ్ మత్స్యకారులకు వంద శాతం(100%) సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులలో మత్స్య సంపదను గణనీయంగా పెంచి చేపల వేట వృత్తిపై ఆధారపడిన వారికి సంపూర్ణంగా ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.