NationalNews

ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు పంపిణీ

ఎస్.కే. భాటియా అనే ఫార్మా కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను పంపిణీ చేశారు. హర్యానాలోని పంచకులలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ బహుమతికి ఎంపికైన 15 మంది ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చారు. వీటిలో టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లు ఉన్నాయి. ఈ వాహనాలను కంపెనీ పనికి వాడితే పెట్రోల్ ఖర్చును కూడా కంపెనీనే భరిస్తుందట.