NewsTelangana

నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి

నియంతృత్వ సర్కారును దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. సభలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన యూనీవర్సిటీ కోసం కనీసం స్థలం కూడా కేటాయించలేదని కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. వరంగల్‌ జిల్లాలోని ఆలయాలను పట్టించకోవడంలేదని.. కూలిపోయే దశలో ఉన్న కాకతీయ కళామండపాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఫౌంహౌస్‌ను వీడింది లేదు… వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదన్నారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రోజే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 20వేల కోట్లు రోడ్ల కోసం కేంద్రం ఖర్చు పెడుతుందని కేంద్రమంత్రి వివరించారు.