Home Page SliderTrending Today

బాలీవుడ్‌ను వదలని ధోని మేనియా..!

ప్రముఖ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంటే ఇష్టపడని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరేమో మరి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ధోని అంటే తెలియనివారు ఎవరు ఉండరనే చెప్పాలి. అంతేకాకుండా ప్రముఖ సినీహీరోలు సైతం తమ అభిమాన క్రికెటర్ ధోని అనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తన అభిమాన క్రికెటర్ ధోని అని తెలిపారు.  అంతేకాకుండా ధోని తన ఆట కోసం బాగా కష్టపడే వ్యక్తి అని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అతని దృష్టంతా ఎప్పుడూ క్రికెట్ పైనే ఉంచడంతో ధోని అంత ఎత్తుకు ఎదిగాడన్నారు.

అయితే ఈ వారాంతంలో సల్మాన్ ఖాన్ సినిమా “కిసీ కా భాయ్..కిసీ కా జాన్” విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ ఓ టీవి షోలో పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే పిల్లలు తమకు ధోని అంటే చాలా ఇష్టమని చెప్పగా సల్మాన్ ఖాన్ కూడా నేను ధోని అభిమానినే అన్నారు. అయితే  సల్మాన్ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్‌స్పోర్ట్స్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్‌స్పోర్ట్స్‌ తెలుగులో నందమూరి బాలకృష్ట తన కామేంటరీతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇటీవల IPL ప్రారంభోత్సవ వేడుకలలో కూడా ఇండియా టాప్ సింగర్ అర్జిత్ సింగ్ ధోని పాదాలను తాకి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ధోని అభిమానులని తెలియడంతో ధోని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.