ఐఏఎస్ కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందన
తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. బాలల హక్కుల సాధన విషయంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా పేదల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని అందుకే ఆయనకు జాతీయ బాలల రక్షణ కమీషన్ పురస్కారానికి ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని మెచ్చుకున్నారు. ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి. 2015 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన 2013లో కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలను 609 మందిని గుర్తించి దాతల సహాయంతో వారి చదువుకు సహాయపడ్డారు. అలాగే భర్తలను కోల్పోయిన 35 మంది మహిళలకు ఇళ్లు నిర్మింపజేశారు.