Andhra PradeshHome Page Slider

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టులో ఊరట

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు ​​జారీ చేయొద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడంపై ఈడీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు కవితకు సమన్లు ​​జారీ చేయబోమని తెలిపింది.