ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌కు లిక్కర్ పాలసీ కేసులో మరోసారి చుక్కెదురైంది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రివాల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం కేజ్రివాల్ సీబీఐ విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు జూలై 31వరకు పొడిగించింది.