జాగ్వార్ హీరో ఓటమి
కర్ణాటక బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. చన్నపట్న నియోజకవర్గంలో జాగ్వార్ సినిమా హీరో, కేంద్ర మంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓటమి పాలయ్యారు. జేడీఎస్ నుంచి బరిలోకి దిగిన ఆయన 25,413 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వర చేతిలో ఓటమి చవి చూశారు. మరోవైపు కర్ణాటక మాజీ బస్వరాజు బొమ్మైకుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మై శిగ్గాన్ నియోజకవర్గంలో 13,448 ఓట్లకు పైగా తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక సండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణ 9,649 ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతపై విజయం సాధించారు.