Home Page SliderInternational

ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణేకు అరుదైన అవకాశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు  విశేష గౌరవం లభించబోతోంది. మార్చి12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో అవార్డ్ ప్రెజెంటర్‌గా ఆమెకు అవకాశం దక్కింది. ఎమిలీ బ్లంట్, జెన్నిఫర్ కొన్నెలీ, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, మైఖెల్ బి జోర్డాన్ వంటి హాలివుడ్ ప్రముఖులతో పాటు దీపిక పేరు కూడా ప్రకటించింది ఆస్కార్ అకాడమీ. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. గత సంవత్సరం జరిగిన కేన్స్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా,ఫిఫా వరల్డ్ కప్ ప్రజెంటర్‌గా కూడా దీపిక పాల్గొనడం జరిగింది.

లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక జరగబోతోంది. భారత్ నుండి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు నామినేషన్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనితో ఈ చిత్రబృందం కూడా ఈ వేడుకలో పాల్గొనబోతోంది. తెలుగు గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ పాటను వేదికపై ఆలపించబోతున్నారు.