DAV స్కూల్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
తాజాగా తెలంగాణాలోని DAV స్కూల్‌లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదని.. ఈ ఘటన ఋజువు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసుపై విధించిన రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రజినీకుమార్ DAV స్కూల్‌లో చాలాకాలం నుండి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రజనీకుమార్ డ్రైవర్ ముసుగులో అరాచకాలకు పాల్పడ్డాడు. రజినీకుమార్ అరాచకాలకు ప్రిన్సిపాల్ అండ తోడవడంతో ఆయన రెచ్చిపోయాడు. ఈ విధంగా రజినీకుమార్ స్కూల్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన గత 6 నెలలుగా డిజిటల్ క్లాసుల్లో చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీంతో రజినీకుమార్‌ను,ప్రిన్సిపాల్ మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ రజినీకుమార్‌పై అత్యాచారం,పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు హైదరాబాద్ DAV స్కూల్ ప్రిన్సిపాల్‌పై స్కూల్ యాజమాన్యం వేటు వేసింది. చిన్నారిపై లైంగిక దాడి ఘటనకు బాధ్యుడిని చేస్తూ..పార్తీపన్‌ను DAV యాజమాన్యం డిస్మిస్ చేసింది. పార్తీపన్ హైదరాబాద్‌లో ఐదు DAV స్కూల్స్‌కి AROగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క విద్యాశాఖ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాధికారులను ఆదేశించింది. దీంతో విద్యాశాఖాధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం వారు స్కూల్ టీచర్స్ నుంచి స్టేట్‌మెంట్స్ సేకరిస్తున్నట్టు సమాచారం. కాగా విచారణ పూర్తి చేసి..సాయంత్రంలోపు నివేదిక ఇస్తామని HYD DEO తెలిపారు.