ట్రంప్-కమలా హారిస్‌ల మధ్య డిబేట్‌కు డేట్ ఫిక్స్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య డిబేట్‌కు డేట్ కూడా ఫిక్సయ్యింది. ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని ట్రంప్ సవాలు విసిరారు. దీనితో వచ్చే నెలలో వీరిద్దరి మధ్య డిబేట్ జరగనుంది. అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ డిబేట్‌కు సిద్దమేనంటూ ప్రకటించారు. సెప్టెంబరు 4న ఫాక్స్ న్యూస్ ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇదే తేదీన నిజానికి పూర్వ అభ్యర్థి బైడెన్‌కు, ట్రంప్‌కు ఏబీసీ ఛానెల్‌లో డిబేట్ జరగవలసింది. కానీ ఇప్పుడు బైడెన్ వైదొలగడంతో అది రద్దయ్యింది. ఇప్పుడు ఈ ఫాక్స్ న్యూస్ డిబేట్ పెన్సిల్వేనియాలో జరుగుతుంది. ఈ సారి వేదిక వద్ద ప్రేక్షకులను కూడా అనుమతించనున్నారు. జూన్‌లో ట్రంప్, బైడెన్‌ల మధ్య జరిగిన డిబేట్ అనంతరం సొంతపార్టీ నుండే బైడెన్‌కు వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష రేసు నుండి తప్పుకుని, కమలాహారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.