సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్
కాంగ్రెస్ గురువారం సాయంత్రం ప్రకటించిన 57 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.
పెద్దపల్లి – గడ్డం వంశీకృష్ణ
మల్కాజిగిరి – సునీత మహేందర్ రెడ్డి
సికింద్రాబాద్ – దానం నాగేందర్
నాగర్ కర్నూల్ – డాక్టర్ మల్లు రవి
చేవెళ్ల – డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
తాజాగా కాంగ్రెస్ జాబితాలో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరారు. దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఐదేళ్ల పాటు మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఓటమి తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారడంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ జి రంజిత్ రెడ్డి 17వ లోక్‌సభ సభ్యుడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఆయన చేవెళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. 57 మంది పేర్లను విడుదల చేసింది. కాంగ్రెస్ తమ మూడో జాబితాలో 57 మంది పేర్లను విడుదల చేసింది. అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి నేతలు ఉన్నారు.