News

సైరస్ మిస్త్రీ దుర్మరణం

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ 54 ఈ మధ్యాహ్నం దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తున్న మిస్త్రీ మెర్సెడెస్ కారులో వెళ్తుండగా డివైడర్ ఢీకొని మృతి చెందారు. రతన్ టాటా తర్వాత.. టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీ… అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అత్యంత అవమానకరరీతిలో తిరుగుబాటుతో ఆయన పదవి కోల్పోయారు. ఆదివారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మధ్యాహ్నం 3:15-3:30 మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముంబైకి 135 కి.మీ దూరంలోని పాల్ఘర్‌లోని చరోటి ప్రాంతంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో నలుగురు ఉండగా… ఇద్దరు మృతి చెందారు. భారతీయ పరిశ్రమ మెరిసే స్టార్ అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సంతాప ట్వీట్ చేశారు.