NewsTelangana

సైబరాబాద్‌ వాహనదారులు అలర్ట్‌..!

హైదరాబాద్‌ నగరంలో రోడ్డుపై వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఫలితంగా రోడ్లపై ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. ఈ ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నారు. గత నెల రోజులుగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోప్‌ విధానం అమలు చేయగా… మంచి ఫలితాలు ఇవ్వడంతో  రేపట్నుంచి సైబరాబాద్‌లోనూ అమలు చేయనున్నారు. స్టాప్‌ లైన్లు దాటినా, రోడ్లపై విధి వ్యాపారాలు నిర్వహించినా ఫైన్‌ వేయనున్నారు. దీని ద్వారా వాహనదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనుంది.