భద్రాచలంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం
ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తెల్లవారు జాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.

