BusinessHome Page SliderNationalNews

ప్రముఖ బ్యాంక్ సీఈవోపై క్రిమినల్ కేసు

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఆయనపై ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ ఐ ఆర్ కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్ లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు. కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఎం. సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్ డీ ఎఫ్ సీ సీఈవో పైఇలా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు ఏమిటంటే..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని ట్రస్ట్ ఆరోపణలు చేసింది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది.