Home Page SliderInternational

థ్రెడ్స్ యాప్‌లో రికార్డ్‌ సృష్టించి..గిన్నిస్ బుక్‌లో చోటు

ట్విటర్‌కు పోటీగా మెటా సంస్థ “థ్రెడ్స్” యాప్‌ను తాజాగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ థ్రెడ్స్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కాగా ఈ యాప్ వచ్చిన ఒక్కరోజులోనే లక్షలమంది యూజర్లు దీనికి సైన్-అప్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ థ్రెడ్స్ యాప్‌లో రికార్డ్ సృష్టించాడు. ఆయనే “జిమ్మీ డోనాల్డ్‌సన్”.ఈయన థ్రెడ్స్ యాప్‌లో అతి తక్కువ టైమ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ను సాధించి రికార్డ్ సృష్టించాడు. దీంతో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఈయన యూట్యూబ్,థ్రెడ్స్ ఫాలోవర్స్ జిమీ డోనాల్డ్‌సన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ యూట్యూబర్ ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లను కలిగిన యూట్యూబ్‌ర్లలలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాడు. కాగా జిమీ డోనాల్డ్‌సన్ Mr. Beast పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు.