Home Page SliderTrending Today

3 దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్.. హ్యాపీలో రజనీకాంత్

నటుడు రజనీకాంత్ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఓ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.

చెన్నై: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన ఆప్త మిత్రుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడంపై నటుడు రజనీకాంత్ స్పందించారు. 33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో కలిసి వర్క్ చేస్తున్నా. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రంలో ఆయనతో స్క్రీన్ పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమితానందంతో నా మనసు నిండిపోయిందని రజనీకాంత్ చెప్పారు.