‘అవినీతి వారసత్వం కాదు’- మోదీ
అవినీతి సాధారణ నేరం కాదని, కొందరు అవినీతిని వారసత్వంగా భావిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ అని, ఈ సంస్థ సామాన్యప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తోందని, ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 2014లో తాము అవినీతిపై యుద్దం ప్రారంభించామన్నారు. సీబీఐ వంటి సంస్థలు స్వతంత్య్ర ప్రతిపత్తి గల సంస్థలని, వాటిపై ఏ రాజకీయ ఒత్తిడులు ఉండవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ శాఖలలో ఏర్పడిన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నాన్ని చేస్తున్నామని, అవినీతి రహిత రాజ్యంగా భారత్‌ను నిలబెడతామని ప్రధాని వ్యాఖ్యానించారు.