దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉండడం దేశప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తుంది. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరింది. నిన్నటితో పోలిస్తే దేశంలో ఈ రోజు 523 కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ..వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.