కాపీరైట్ ఉల్లంఘన.. కాంగ్రెస్ ట్వీట్టర్ అకౌంట్ బ్లాక్ చేయండి : కోర్టు
భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటను అక్రమంగా ఉపయోగించారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సహా ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ కాపీరైట్ కేసు నమోదు చేశారు. దీంతో బెంగుళూరు కోర్టు కాంగ్రెస్ ట్వీట్టర్ అకౌంట్ తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఎంఆర్టీ సంగీతాన్ని నిర్వహిస్తున్న ఎం. నవీన్‌కుమార్ గత నెలలో యాత్ర సందర్భంగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిన.. కెజిఎఫ్-2 సినిమా నుండి సంగీతాన్ని ఉపయోగించారని రాహుల్ గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు.
భారత్ జోడో యాత్ర ప్రచార ట్వీట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. భారత్ జోడో యాత్ర సోషల్ మీడియా హ్యాండిల్‌ను ప్రస్తావిస్తూ.. ఒరిజినల్ కాపీరైట్ వెర్షన్ను చట్టవిరుద్ధంగా సింక్రనైజ్డ్ వెర్షన్‌తో పోల్చిన సీడీని సంగీత సంస్థ చూపించిందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ప్రొసీడింగ్స్ గురించి తమకు తెలియదని, ఆర్డర్ కాపీ ఏదీ లేదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఎలాంటి ఆర్డర్ కాపీ అందుకోలేదన్నారు. మేమంతా చట్టబద్దంగా అనుసరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.