వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా…
జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నట్టు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు కాపుల కంచుకోట పిఠాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. తనకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేయాలని ఉందని, ఎంపీ ఆలోచన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఖరారు చేయగా.. ఇవాళ ఆయన సీటును ప్రకటించుకున్నారు.