రెండు వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేశారు: ఈడీ
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకొనే కుట్ర జరిగిందని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టవిరుద్ధంగా సొంతం చేసుకొనేందుకు ప్రయ త్నించారని వెల్లడించింది.నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో బుధవారం ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహల్ కు 76 శాతం వాటాలున్నట్టు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు పేర్కొన్నారు. “ఆ సంస్థ ద్వారా ఏజేఎలు కేవలం రూ.90 కోట్ల రుణమిచ్చి దాన్ని తీర్చడం లేదన్న సాకుతో ఏజేఎల్కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేశారు. యంగ్ ఇండియా స్థాపనే దురుద్దేశపూరితం” అన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.