పార్లమెంట్ భవనంలో వాటర్ లీక్‌పై కాంగ్రెస్ పార్టీ సెటైర్
పార్లమెంట్ భవనం లాబీలో వాటర్ లీక్ కావడంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్ అంటూ ఫోటోలు షేర్ చేసి విమర్శలు కురిపించింది. పార్లమెంట్ లాబీలో నీటి లీకేజి జరిగింది. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. గత ఏడాదే దీనిని ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన భవనాన్ని నిర్మించారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్ విషయం దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. సుప్రీంకోర్టు వరకూ ఈ అంశం వెళ్లి విచారణలు కూడా జరిగాయి. అందుకే ఈ విషయంలో బయట పేపర్ లీకేజీ అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపించింది.
