కాంగ్రెస్ నేతలు ఆ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి: సోనియా గాంధీ
దేశంలో త్వరలోనే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాగా ఈ రోజు నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలకు అతి నమ్మకం పనికిరాదన్నారు. కాగా కష్టపడి పనిచేస్తేనే లోక్‌సభ ఫలితాలే మల్లీ ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదని సోనియా దుయ్యబట్టారు. ఈ క్రమంలో పార్లమెంటుకు కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలు పార్లమెంట్ సెషన్స్‌కు మిస్ కావొద్దని సోనియా గాంధీ సూచించారు.