హైదరాబాద్ బల్దియా వద్ద కాంగ్రెస్ నేతల నిరసనలు
వరద బాధితులకు సహాయం అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్ బల్దియా వద్ద ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు నిరసనలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నించారు. వరద బాధితులకు 10 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు 5 గురికి లోనికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చినా వారు అంగీరకించలేదు. ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మల్లురవి, అంజనాకుమార్ యాదవ్ వంటి నేతలతో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వారు ఈ ముట్టడికి ప్రయత్నించినట్లు తెలిపారు. గన్ పార్క్ నుండి జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వరకూ ర్యాలీగా వచ్చి నినాదాలు చేస్తున్నారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు కొందరిని అదుపులో తీసుకున్నారు. కార్పొరేటర్ విజయారెడ్డిని సైతం అదుపులో తీసుకున్నారు. కమీషనర్‌కు వినతి పత్రం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.