ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ భారీ స్కామ్..
ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ స్కామ్ చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయకపోవడంలో ఏదో మతలబు ఉందన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తోందన్నారు. మంత్రి పొంగులేటి తమను అరెస్టు చేస్తామని చెప్పడాన్ని ఖండించారు. ఎవరెవరు అరెస్టు అవుతారో చెప్పడానికి పొంగులేటి ఎవరు అని ప్రశ్నించారు. వీళ్లకు తమ పార్టీ భయపడేదిలేదన్నారు. తెలంగాణలో సర్కార్ కాదు సర్కస్ నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిల్లీకి మూటలు పంపే పనిలో బిజీగా ఉన్నారన్నారు.