”మహా” స్టార్ క్యాపెయినర్ గా సీఎం రేవంత్‌రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరా వంటి ఉద్దండుల సరసన ప్రచార జాబితాలో పేరు సంపాదించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంపిక చేసిన 10 మంది ప్రముఖ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి పేరుండటం విశేషం.తర్వలో గాంధీ కుటుంబీకులతో కలిసి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.