Home Page SliderTelangana

ప్రగతి భవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించిన సీఎం కేసీఆర్

విజయదశమి వేడుకలు ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి.

హైదరాబాద్: విజయదశమి వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకొని ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సంప్రదాయ పద్ధతిలో  జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, మంచి విజయాలు సిద్ధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు.