Andhra PradeshHome Page Slider

జనవరి 3న కాకినాడకు సీఎం జగన్

ఏపీ: సీఎం జగన్ జనవరి 3న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. అదేరోజు వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3,000 లకు పెంపుదల చేసే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పెన్షన్ పెంపుతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. సీఎం ప్రోగ్రామ్ కోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.