రైతుల కన్నీటికి సీఎం జగనే కారణం: చంద్రబాబు
ఏపీలో అకాల వర్షాల వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతుల కన్నీళ్ళకు కారణం సీఎం జగనేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అకాల వర్షం వల్ల తడిసిపోయిన ధాన్యమును పరిశీలించడానికి గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో పర్యటించారు. ఆ ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని నాడు హుద్ హుద్ తుఫాను వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విశాఖ వెళ్లానని అది నా పట్టుదల అని, కానీ నేడు సీఎం జగన్ కు బాధ్యత లేదా ఎందుకు రైతులు దగ్గరకు రావటం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ మొదటి నుంచి ధాన్యం సేకరణ జరగాలని కానీ అలా జరగలేదన్నారు. రైతులకు గోనె సంచులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎందుకన్నారు. అలాగే ధాన్యం రవాణాకు లారీలు కూడా ఏర్పాటు చేయలేని జగన్ ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెప్తారన్నారు.
