ఏపీలో అధికారుల ప్రక్షాళన మొదలుపెట్టిన సీఎం
ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే చంద్రబాబు తన కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏపీలో అధికారుల బదిలీలపై కూడా సీఎం కసరత్తు ప్రారంభించారు.ఈ మేరకు ఇవాళ సీఎంఓ, సీఎస్, డీజీపీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో మార్పులు,చేర్పులపై సీఎం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏస్ అధికారులు రాజమౌళి,కార్తీక్ మిశ్రాలను CMO లోకి తీసుకురానున్నారు. కాగా ఈ ఇద్దరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.