సీఎం ఎంపిక నిర్ణయం పార్టీ హైకమాండ్‌కు అప్పగించిన సీఎల్పీ
సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క మద్దతు తెలిపారు. సీఎల్పీ నేత ఎంపికపై ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. గంటపాటు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ విషయమై నేతలు చర్చించారు. మరో రెండు గంటల్లో సీఎల్పీ నేత ఎంపికపై క్లారిటీ రానుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్టు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేతో డీకే శివకుమార్ తోపాటుగా, దీపాదాస్ మున్షి మాట్లాడుతున్నారు.