NationalNews

రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాటలు

రాజస్థాన్ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో కలిసి గుజరాత్‌లో ప్రచారం చేయకుండా బద్ధ శత్రువు సచిన్ పైలట్‌ను ‘దేశద్రోహి’ అంటూ దూషించడానికే వెచ్చిస్తున్నట్టు కన్పిస్తున్నాడు. ఒక గద్దర్… ద్రోహి ముఖ్యమంత్రి కాలేడని, హైకమాండ్ ఎన్నటికీ సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయబోదని… 10 మంది ఎమ్మెల్యేలు లేని వ్యక్తిని…. తిరుగుబాటు చేసి పార్టీకి ద్రోహం చేసిన ద్రోహి అంటూ దుమ్మెత్తిపోశాడు. పార్టీ అధ్యక్షుడు తన సొంత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం భారతదేశంలో మొదటిదన్నారు. 2020లో పైలట్ దుర్మార్గపు తిరుగుబాటు చేశాడంటూ మండిపడ్డారు. తిరుగుబాటుకు సాక్ష్యాలు లేకుండానే “నిధులు బిజెపి”, అమిత్ షాతో సహా సీనియర్ బిజెపి నాయకులతో ప్రారంభించిందంటూ మండిపడ్డారు. వాస్తవానికి అదే సమయంలో.. పైలట్, సుమారు రెండేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తిరుగుబాటు సమయంలో… 19 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నారు. పార్టీ చీల్చడం లేదంటే ముఖ్యమంత్రి కావడం… పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం అన్న మూడు సూత్రాల ఆధారంగా పైలట్ తిరుగుబాటు చేశారన్న అభిప్రాయం ఉంది.

lnf60k2

వంద మంది ఎమ్మెల్యేలు తన పక్షం ఉన్నారంటూ గెహ్లాట్ ప్రదర్శన చేసి చూపించడం.. పైలట్ నీరుగారిపోయాడు. మొత్తం ఘటన తర్వాత పైలట్ పీసీసీ చీఫ్ పోస్టుతోపాటు, డిప్యూటీ సీఎం పదవి కూడా కోల్పోయారు. మొత్తం వ్యవహారంలో పైలట్ ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారన్నారు గెహ్లాట్. అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారని… ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికి 5 కోట్లు నుంచి 10 కోట్ల వరకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఎమ్యెల్యేలకు అనుమతి లేని సమయంలో ప్రధాన్, ఎమ్మెల్యేల క్యాంప్‌ను సందర్శించారని గెహ్లాట్ చెప్పారు. ఐతే గెహ్లాట్ వాదన నిరాధారమైనదని బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకత్వం తమ ఇంటిని చక్కదిద్దడంలో విఫలమైందని… కాంగ్రెస్ రాజస్థాన్‌ను కోల్పోతోందని అందుకే గెహ్లాట్ కంగారుపడుతున్నారన్నారు బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియా. గెహ్లాట్ తన వైఫల్యానికి బీజేపీని ఆపాదిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

Rajasthan: 22-year-old letter new headache for state BJP, Poonia | Cities  News,The Indian Express

పైలట్ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన హోదాను తగ్గించబడినప్పటికీ, రాజస్థాన్‌లో ఒకరకమైన ప్రశాంతత ఏర్పడింది. ఆగస్టు వరకు, పార్టీ అధ్యక్షురాలిగా వారసుడిని వెతకాల్సిన సోనియా గాంధీ, ఆ పదవిని చేపట్టడానికి గెహ్లాట్‌పై మొగ్గు చూపారు. ఇది తనకు అది ఆమోదయోగ్యం కాదంటూ సోనియాకు గెహ్లాట్ తేల్చి చెప్పడంతో రాజస్థాన్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రిగా ఉండటానికి అనుమతిస్తే, ఏఐసీసీ చీఫ్ పోస్టు సైతం నిర్వహిస్తానంటూ మెలికపెట్టారు. ఒక వ్యక్తికి రెండు పోస్టులు ఉండవని.. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనేది పార్టీ ఆదేశమని రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పడంతో మొత్తం వ్యవహారం మరో టర్న్ తీసుకొంది. గెహ్లాట్‌ను పార్టీ బాస్‌గా నియమించేటట్టయితే.. ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి సెప్టెంబర్ చివరి వారంలో రాజస్థాన్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.

Rajasthan: 'Over 100' MLAs With Ashok Gehlot, Congress Keeps Door Open for Sachin  Pilot

జైపూర్‌లో జరిగిన అధికారిక సమావేశానికి హాజరు కాకుండా, గెహ్లాట్‌కు అనుబంధంగా ఉన్న 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఒక సమాంతర సమావేశాన్ని నిర్వహించి… పైలట్‌ను సీఎంగా ఆమోదించేది లేదని తెగేసి చెప్పారు. గెహ్లాట్ ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటికీ, సీఎంగా కూడా తమ ఓటు ఆయనకేనంటూ తేల్చి చెప్పారు. ఐతే మొత్తం వ్యవహారంపై హైకమాండ్ కన్నెర్రజేయడంతో… ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు గానీ.. తనకు కాదంటూ గెహ్లాట్ చెప్పుకొచ్చాడు. సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఆయనంతట ఆయనే ప్రచారం చేసుకున్నారని… ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు భావించారని… సొంత ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎమ్మెల్యేలు ప్రశ్నించడం తప్పెలా అవుతుందన్నారు గెహ్లాట్. నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నానంటూ అసలు స్టోరీ చెప్పారు గెహ్లాట్. 2018లో రాజస్థాన్‌లో గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పదవిని పైలెట్‌కు, గెహ్లాట్‌కు పంచుతామంది కాంగ్రెస్ హైకమాండ్. కానీ గెహ్లాట్ తనను సైడ్ చేసేశారంటూ ఆరోపించాడు పైలట్. ఐతే ముఖ్యమంత్రితో సమానమైన పదవి ఇస్తామని పైలట్‌కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదంటాడు గెహ్లాట్.