Andhra PradeshHome Page Slider

‘దేవర’ థియేటర్ వద్ద ఘర్షణ..లాఠీఛార్జ్

‘దేవర’ మూవీ థియేటర్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దేవర చిత్రం విడుదల కావడంతో కడపలోని రాజా థియేటర్ వద్ద భారీగా తోపులాటలు జరిగాయి. ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో సందర్భంలో అభిమానులందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అదుపు చేయలేకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు పోలీసులు. పలువురికి గాయాలయ్యాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తుండడం, అందాలతార జాన్వికపూర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దీనితో టిక్కెట్ రేటు రెండితలు పెరిగినా అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర, వరద అనే పాత్రలలో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ.