NewsTelangana

కవితకు ఊరట

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కాంలో కవితదే ముఖ్య పాత్ర అంటూ ఆరోపణలు చేసిన ప్రతివాదులు బీజేపీ ఎంపీ పర్వేశ్‌ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సాలకు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని… సోషల్‌ మీడియా, మీడియా ముందు ఎవ్వరూ స్పందించకూడదని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.