National

చిరు- సల్మాన్ ల ‘థార్ మార్ థక్కర్ మార్’ సాంగ్ రిలీజ్

‘ఆచార్య’ ఘోర పరాజయం తర్వాత మెగాస్టార్ ఆశలు పెట్టుకున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’ మూవీ. ఈ సినిమా దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. తన వయస్సుకు తగిన పాత్రలో నటించారని సమాచారం. ఈసినిమా మలయాళ సినిమా ‘లూసీఫర్’ రీమేక్. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించారు.

ఇప్పటికే ఈ సినిమాకు గ్రాండ్‌గా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేసారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు, హిందీలో మాత్రమే విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, చిరంజీవికి ఒక స్పెషల్ సాంగ్ ఉంది. దీనిలో ‘థార్ మార్ థక్కర్ మార్’ అంటూ డాన్సులు వేసారు. ఈ పాటలో చిరంజీవితో సల్లూభాయ్ వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఊగిపోవడం ఖాయం అంటున్నారు. పైగా ఈ సినిమాలో తనకు అచ్చొచ్చిన ఖైదీ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. ఖైదీ పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయని, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు సంబరపడుతున్నారు.