చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకునిపై దాడి..
తెలంగాణ తిరుపతి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నాడు 20 మంది దుండగులు తనపై దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇక్ష్యాకుల వారసులమని, రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరారని, అంగీకరించకపోవడంతో తన కుమారుడిపై దాడి చేశారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటన వివరాలు ఆరా తీసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మండిపడ్డారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ధర్మ రక్షకులు దాడులు చేస్తే, రాజ్యాంగ రక్షకులు చూస్తూ ఊరుకున్నారని ఎద్దేవా చేశారు.